SRPT: చిన్ననాటి నుంచే ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలోని బేబీ మూన్ స్కూల్లో సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన చిన్నారులకు సర్టిఫికెట్లు, బెల్టులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానసిక, శారీరక ధారుడ్యానికి కరాటే శిక్షణ ఎంతో అవసరమన్నారు.