JN: జనగాం- సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల గణపురం మండలం నవాబుపేట వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన దరిపల్లి నరసింహులు, వనపర్తి శివారు మర్రితండాకు చెందిన మోతీరాం అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.