AP: లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతుండటంతో విజయవాడ జిల్లా కోర్టు నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెరికోజ్ విన్స్(ఉబ్బిన సిరలు)తో బాధపడుతున్న మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్కి తీసుకెళ్లారు.