టైప్ 2 డయాబెటిస్తో బాధపడేవారు అవకాడో తింటే మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు.. బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, ఓట్స్ మీల్స్, తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర పానీయాలు, మద్యం, జంక్ ఫుడ్ వంటి పదార్థాలను వారు తినకూడదు.