ADB: జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 12న స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఊరే గణేశ్, బాల శంకర్ కృష్ణ తెలిపారు. స్థానిక డైట్ మైదానం ఎదుట ఉన్న వివేకానందుని విగ్రహం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు.