ADB: తలమడుగు మండలం ఆర్లి కే గ్రామంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన జెండా’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం జెండాను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల మాల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.