మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ‘విదుర నీతి’ బోధిస్తాడు. సంధి ప్రస్తావనతో పాండవుల వద్దకు వెళ్లి వచ్చిన సంజయుడు, మరునాడు సభలో మాట్లాడతానంటాడు. దీంతో ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి ఆందోళనతో నిద్రపట్టదు. మనశ్శాంతి కోసం తన మంత్రి, సోదరుడైన విదురుడిని పిలిపించుకుంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి హితవు పలుకుతూ.. ధర్మం, రాజనీతిపై విదురుడు చెప్పిన మాటలే ‘విదుర నీతి’గా ప్రసిద్ధి చెందాయి.