నెల్లూరు జిల్లా సాగునీటి పారుదల శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. పనుల్లో వాటాలు, సింగిల్ టెండర్లు, ఫోన్‌పే వసూళ్లపై ఫిర్యాదులు రావడంతో జేడీ శైలజ విచారణ జరిపారు. అయితే విచారణలో అంతా సవ్యంగానే ఉందని, ఆరోపణల్లో నిజం లేదని సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్నారు. రూ.93 కోట్ల పనుల్లో అక్రమాలు జరిగినట్లు విమర్శలు ఉన్నాయి.