ATP: ఓవైసీ ప్రధాని పదవిపై చేసిన వ్యాఖ్యలు గాలిలో మేడలేనని గుంతకల్లు కిసాన్ కాంగ్రెస్ నాయకులు టీ.సీ నారాయణ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘వందేమాతరం’ పలకని సంకుచిత భావాలున్న వారు ప్రధాని కావడం అసాధ్యమన్నారు. ముస్లిం సోదరులంతా ‘భారత మాతకు జై’ అంటూ హిందూ-ముస్లిం ఐక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు.