HNK,WGL జిల్లాలను కలిపి మళ్లీ ఒకే వరంగల్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ “ఫోరం ఫర్ బెటర్ వరంగల్” ఆధ్వర్యంలో ఏకశిలా పార్కులో దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ జిల్లాను మళ్లీ ఏకం చేయాలనే డిమాండ్ న్యాయసమ్మతమని, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.