NZB: డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇందల్వాయి మండలానికి చెందిన భాదవత్ సురేశ్ అండర్-19 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయమ ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ సోమవారం తెలిపారు. హరియాణాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో అతను పాల్గొంటారని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు అతన్ని అభినందించారు.