E.G: నిడదవోలు మండలం అట్లపాడులో సోమవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి కోట సత్యనారాయణ (28) అనే యువకుడు తన తమ్ముడు సాయిరాం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టాడు. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.