సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్ విశాఖ తూర్పు ఇంచార్జ్ ప్రియాంక దండి విమర్శించారు. సోమవారం విశాఖలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వారికి అదనపు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.