KNR: ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు చీర సారేలను అందజేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి ధన్య వాదాలు తెలిపారు.