వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మంత్రి కొండా సురేఖ దంపతుల పై తిరుగుబాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయమైంది. సారయ్య వెనుక కీలక నేతల మద్దతు ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. అధిష్ఠానం మౌనం వెనుక లెక్కలున్నాయని, నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యంపై క్యాడర్ అసంతృప్తి పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.