ఖమ్మం జిల్లాలో యాసంగి పంటల కోసం సాగర్ జలాల విడుదల షెడ్యూల్ను ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. మొత్తం 7 తడుల ద్వారా ఏప్రిల్ 7 వరకు నీటిని అందించనున్నారు. ఇందుకోసం మొత్తం 26.41 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. రెండో తడి కింద జనవరి 8 నుంచి 22 వరకు, మూడో తడి జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నీరు విడుదల కానుంది.