కృష్ణా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు విద్య, వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని MLA యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బాపులపాడు(M) రెమల్లెలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ క్లినిక్కు శంకుస్థాపన చేయగా, రూ.44 లక్షలతో నిర్మించిన అంతర్గత CC రహదారులను ప్రారంభించారు. అనంతరం ప్రజా దర్బార్లో పాల్గొన్నారు.