KMM: కల్లూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ AE మహేంద్ర బాబు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 వరకు విద్యుత్ బంద్ ఉంటుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.