కోనసీమ: అమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలను నిషేధిస్తూ శుక్రవారం పలు గ్రామాలలో హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ.. చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పందాలు నిర్వహించే బరుల వద్ద నిరంతరం పోలీసులు పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.