BHPL: గోరికొత్తపల్లిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన CM కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథులుగా DEO రాజేందర్, MEO, SI, సర్పంచ్ శంకర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. వారు క్రీడాకారులతో కలిసి రన్ చేశారు. పల్లెల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు సీఎం కప్ ఉత్తమ వేదిక అని పేర్కొన్నారు.