AP: పిఠాపురంలో ఏం జరిగినా వైరల్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పిఠాపురానికి వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడ కూర్చుని ఏరి వేస్తానని ఫైర్ అయ్యారు. ‘గత ప్రభుత్వం బూతులు తిట్టడం, కేసులు పెట్టడం మాత్రమే చేసింది. పిఠాపురంలో మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరి శ్వాస వరకు అధికారం ఉన్నా లేకపోయినా పిఠాపురం ప్రజల కోసం పని చేస్తా’ అని పవన్ పేర్కొన్నారు.