NZB: సంక్రాతి సెలవులకు ఊర్లకు వెళ్లే వారికి సీపీ సాయి చైతన్య ముఖ్య సూచనలు చేశారు. ఖరీదైన వస్తువులు, డబ్బు, బంగారం బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దన్నారు. ఇంటికి బలమైన తాళాలు,సెంట్రల్ లాకింగ్ ఉపయోగించాలన్నారు. సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు.