BDK: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీలోని శ్రీశ్రీశ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ధర్మపీఠ క్షేత్రంలో ఇరుముడి కార్యక్రమ మహోత్సవం గుడి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ కార్యక్రమాలు విశ్వశాంతికి దోహదం చేస్తాయన్నారు.