TG: ములుగు జిల్లాలోని మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. సంక్రాంత సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలొస్తున్నారు. కాగా, జంపన్నవాగు దగ్గర ఓ చిన్నారి అదృశ్యమైంది. మంత్రి సీతక్క తప్పిపోయిన చిన్నారిని గమనించి సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. కంట్రోల్ రూమ్ దగ్గర చిన్నారి సేఫ్గా ఉందని చిన్నారి తల్లిదండ్రులకు సీతక్క తెలిపారు. జాతరలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.