తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.11.50 కోట్ల వసూళ్లు సాధించినట్లు పేర్కొన్నాయి. శివకార్తికేయన్ గత సినిమాల కంటే ఇవి చాలా తక్కువట. ఇక 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఈ మూవీని దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించింది.