W.G: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం అనుమతి కావాలని టంగుటూరి విగ్రహ సాధన కమిటీ సభ్యులు వెంకటరామయ్య, రంగసాయి కోరారు. ఆదివారం భీమవరంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం పంతులు భీమవరం వచ్చినప్పుడు జెండా ఎగురవేసిన ఈ ప్రదేశానికి ప్రకాశం చౌక్ అని నామకరణం చేశారని తెలిపారు.