KMR: రాజంపేటలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసినట్లు సర్పంచ్ దుబ్బ శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం పలు వార్డుల్లో మురికి కాల్వల పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమ్రాన్ అలీ, ఉన్నారు.