అన్నమయ్య: జిల్లాలో ఆదివారం నాన్వెజ్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కేజీ రూ.280, స్కిన్లెస్ చికెన్ రూ.300గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.850గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో కొరమేను రూ.450, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్ ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు వెల్లడించారు.