SRCL: వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం రోజున రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురికి చీరలు పంపిణీ చేశారు.