GNTR: హరిదాసు అనగా విష్ణుమూర్తి భక్తుడు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో “హరిలో రంగ హరి” అంటూ కీర్తనలు పాడుతూ, తలపై అక్షయపాత్ర పెట్టుకొని, చేతిలో చిడతలు, తంబురతో ఇంటింటికి తిరుగుతూ భక్తులకు దీవెనలు ఇస్తారు. వీరిని విష్ణువు ప్రతినిధులుగా భావిస్తారు. హరిదాసు పాత్రలో బియ్యం వేస్తే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయం పొన్నూరులో ఇప్పటికీ కొనసాగుతోంది.