NZB: సంక్రాంతి సంబరాలు ముందే రావడంతో ఆర్మూర్ మండలవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామునే గంగిరెద్దుల విన్యాసాలు, డోలు వాయిద్యాల మోతతో పల్లెలు మేల్కొంటున్నాయి. చిన్నారులు గాలిపటాల వేటలో మునిగిపోగా, బసవన్నలను ఆడించే యాచకులు ఇంటింటికీ తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఏటా గ్రామాభివృద్ధి కమిటీల వద్ద ‘ఇనాం’ వసూలు చేసుకుని వారు ఊళ్లకు వెళ్తుంటారు.