JGL: నిర్భాగ్యుల గొంతుకైన కవి, తెలంగాణ శ్రీశ్రీగా పేరుగాంచిన జగిత్యాలకు చెందిన దివంగత అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి జనవరి 12 (1954–1993)ఒకే రోజు కావడం విశేషం. వృత్తి ఫొటో గ్రాఫర్. ప్రవృత్తి కవిగా సిటీలైఫ్ నిర్మొహమాటం, ఎర్రపావురాలు, చురకలు వంటి అక్షర తూటాలను సమాజంపై సంధించిన ప్రభాకర్ తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకుని పదిలపరుచుకున్నారు.