ASR: అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ కేంద్రంలో సంక్రాతి స్పెషల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఈ నెల19వ తేదీ నుండి 25వ తేది వరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆదివాసీ పరిరక్షణ సమితి, మండల అధ్యక్షులు సొమెల స్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీలో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.20వేలు, రూ.10వేలు చొప్పున నగదు బహుమతులు ఉంటాయని చెప్పారు.