AP: సంక్రాంతి పండగపై ప్రజల్లో మార్పు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్రాంతి పండగ అంటే కోడిపందాలు, జూదం కాదన్నారు. జూదాలను బోగీ మంటల్లో కలిపేయాలని పిలుపునిచ్చారు. పండగ సమయంలో రూ.కోట్లు చేతులు మారతాయనేది పోవాలని చెప్పారు. సంస్కృతి ఉట్టిపడేలా పండగను జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు.