PPM: కృష్ణపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిదిగా హాజరయ్యారు. అంగన్వాడీ ప్రాంగణలో భోగిమంటలు, హరిదాసు కీర్తనలతో పండగ శోభ సంతరించుకుంది. ఈ మేరకు చిన్నారులకు కలెక్టర్ భోగి పండ్లను వేసి నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు.