WGL: నర్సంపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బండి భారతి-రమేశ్ దంపతులు ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై చేరామని దంపతులు తెలిపారు.