PDL: మాచర్ల మున్సిపల్ సమావేశ మందిరంలో శుక్రవారం పట్టణ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, ఆహ్లాదకరమైన గ్రీనరీ ఏర్పాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.