SRPT: కోదాడ పట్టణంలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి, రూరల్ సీఐ ప్రతాప్ లింగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి కర్ల లలిత హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, NHRC నిబంధనల ప్రకారం.. ఒక కేసు, అలాగే ఎస్సీ, ఎస్టీ అమెండ్మెంట్ చట్టం–2025 ప్రకారం మరో కేసు నమోదు చేశారు.