AP: జగన్ పులివెందులలో కూడా ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారని మంత్రి ఆనం విమర్శించారు. ఉపాధి అవకాశాలు కల్పించడం జగన్కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కూడా బతుకుతున్నాం. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడకూడదు. పరిశ్రమలను పారిపోయేలా చేసిన మీ ఘనత అందరికీ తెలుసు. ఇవాళ దేశ, విదేశాల నుంచి ఏపీకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు.