NRML: స్వామి వివేకానంద జయంతిని సోమవారం నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి స్థానిక వివేకానంద చౌక్ వరకు 2కే రన్‌ను నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు