ADB: గుడిహత్నూర్ మండలం ముత్నూర్లో ఈనెల 13 నుంచి జరగనున్న అఖండ హరినామ సప్తాహ కార్యక్రమానికి కలెక్టర్కు గ్రామస్థులు ఆహ్వానం అందించారు. ముత్నూర్ గ్రామానికి చెందిన ముండే త్రింబాక్, రామ్ కృష్ణ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తప్పకుండ వస్తానన్నారు.