అన్నమయ్య: సంక్రాంతి పండుగను శాంతియుతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని రాయచోటి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోడిపందెం, మట్కా, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సమయంలో ప్రత్యేక బృందాలతో నిఘా కొనసాగుతుందని ఇన్స్పెక్టర్ బి.వి. చలపతి తెలిపారు.