AP: అమరావతి రాజధాని రైతులకు త్వరలో రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేయాలని CM చెప్పారని పేర్కొన్నారు. అలాగే రైతులకు చెల్లిస్తున్న కౌలును కూడా పెంచుతామని ప్రకటించారు. కర్లపూడి-లేమల్లెలో భూసమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈ మేరకు శుభవార్త చెప్పారు.