SKLM: లావేరు శాఖా గ్రంథాలయంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వివేకానంద చిత్రపటానికి గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానందని నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.