JNG: భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు జనగామకు రానున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మ.1 గం.లకి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ అధికారులతో నిర్వహించే రివ్యూ సమావేశంలో ఆయన పాల్గొంటారని DCC అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తెలిపారు. అనంతరం స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆయన పర్యటన విజయవంతం చేయాలని కోరారు.