MDK: శివంపేట మండలంలోని కొంతన్పల్లిలో గల ఆంజనేయ రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని, రైస్ మిల్లును సీజ్ చేశారు.