MNCL: జన్నారం మండలం దేవుని గూడ రైతు వేదికలో సోమవారం ముగ్గుల పోటీలను సర్పంచ్ రామ టెంకి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మన పండుగ, మన కల, మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకు పోటీలను నిర్వహించామన్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ విశ్వ, ఉప సర్పంచ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.