MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం ప్రభుత్వ పాఠశాల శివారు రోడ్డు పక్కన మరియు పొలాల పక్కన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో అటుగా వెళ్లే రైతులు, ప్రజలు, పిల్లలు, మూగజీవాలకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.