MBNR: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్టీవో అనిల్ పాల్గొన్నారు.