SRCL: చందుర్తి మండలంలో యాసంగి వరి నాట్లు తుది దశకు చేరుకున్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో సాగునీరు అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. జోగాపూర్, నర్సింగాపూర్, బండపల్లి, చందుర్తి గ్రామాల్లోని రిజర్వాయర్లను గోదావరి జలాలతో ఎప్పటికప్పుడు నింపి, నీటని విడుదల చేయాలన్నారు.